ఎండోమెంట్ అధికారుల అవినీతిపై లోకాయుక్త విచారణ.!
పొద్దుటూరు శివాలయంలో ఈఓ శంకర బాలాజీ హయాంలో అమ్మవారి బంగారు హారం, స్వామి వారి వెండి కవచం, ఆలయ బ్యాంక్ ఖాతాలోంచి పెద్ద మొత్తంలో నిధులు మాయమయ్యాయి. వీటిపై స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, ఆలయం చైర్మన్ నారాయణరెడ్డి ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ప్రజా పక్షం పార్టీ అధ్యక్షుడు లక్ష్మిరెడ్డి లోకాయుక్త కోర్టుకు కంప్లైంట్ ఇచ్చారు. దీనిపై మంగళవారం డీఎస్పి కృష్ణ ప్రొద్దుటూరుకు శివాలయానికి విచారణకు వచ్చారు. ఆలయ ఉద్యోగులను విచారించారు. రికార్డులను, బ్యాంక్ ఖాతాలను తనిఖీ చేశారు. దీంతో శివుని సొమ్ము తిన్న ఆలయ అధికారులు ఆందోళన చెందుతున్నారు.
ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.