అధిక ధరలపై ప్రజాసంఘాల నిరసన.!

ధరల పెరుగుదలపై సిపిఎం అనుబంధ ప్రజా సంఘాలు సోమవారం పొద్దుటూరు ఎమ్మార్వో కార్యాలయం వద్ద నిరసన తెలిపాయి. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని, బ్లాక్ మార్కెట్ అరికట్టాలని, గోదాముల్లో దాచిన ఆహార ధాన్యాలను ప్రజలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని విమర్శించారు. సంఘాల నాయకులు శేఖర్, డేవిడ్, ముంతాజ్ బేగం ఎమ్మార్వో ఉదయ భాస్కర్ రాజుకు ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు.