కాస్ట్లీ ఎగ్జిబిషన్ దక్కించుకున్న శివకుమార్.!
ప్రొద్దుటూరులో దసరా సందర్భంగా నిర్వహించే ఎగ్జిబిషన్ ఈసారి శివకుమార్ దక్కించుకున్నారు. శివకుమార్ టెండర్లో రూ.1,85,00,070+18% GSTలకు ఎగ్జిబిషన్ నిర్వహణను దక్కించుకున్నారు. గత ఏడాది కూడా ఈయనే రూ.1,91,44,000లకు ఎగ్జిబిషన్ దక్కించుకున్నారు.
సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్ వేలం పాట నిర్వహించారు. కమిషనర్ విశ్వనాథ్, అసిస్టెంట్ కమిషనర్ మంజునాథ్ గౌడ్ వేలం పాట నిర్వహించారు. 10 మంది కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 1టౌన్ SI మధుసూదన్ రెడ్డి బందోబస్తు ఏర్పాటు చేశారు.