ప్రొద్దుటూరుకు వచ్చే ప్రయాణికులకు సూచన.!

ప్రొద్దుటూరు పట్టణంలోకి వచ్చే ఆర్టీసీ బస్సుల రూట్ మార్చినట్లు డిపో మేనేజర్ గంగాధర్ తెలిపారు.  సబ్ రిజిస్ట్రార్ ఆపీస్ వద్ద కల్వర్టు పనులు జరుగుతున్నాయన్నారు.  ట్రాఫిక్ పోలీసుల ఆదేశాల మేరకు ఆర్టీసీ బస్సులు ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆర్టీసీ బస్టాండ్ వరకు మాత్రమే అనుమతించబడును.  మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పాత బస్టాండ్ వరకు అనుమతించబడును.  తిరిగి సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు ఆర్టీసీ బస్టాండ్ వరకు మాత్రమే అనుమతించబడును.  బస్సులు పాత బస్టాండుకు వెళ్లునప్పుడు పాండురంగ స్వామి గుడి, అన్వర్ థియేటర్ వద్ద మాత్రమే స్టాపింగ్ ఉంటుందన్నారు.