కడప ఎయిర్ పోర్టు పనులను పరిశీలించిన మంత్రి రామ్మోహన్ నాయుడు.!

కడప: అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో, అధునాతన సౌకర్యాలతో, అన్ని రకాల భద్రతా ప్రమాణాలను పాటిస్తూ, కడప ఎయిర్ పోర్ట్ నూతన టర్మినల్ భవన నిర్మాణ పనులను పూర్తిచేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి  రామ్మోహన్ నాయుడు ఎయిర్ పోర్ట్ అధికారులను ఆదేశించారు. 
శనివారం సాయంత్రం కడప ఎయిర్ పోర్ట్ ప్రాంగణంలో నూతన టర్మినల్ బిల్డింగ్ నిర్మాణ పనుల పురోగతిని మంత్రి పరిశీలించారు.. 
ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి మంత్రి ఎస్.సవిత, జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్, రాజ్యసభ సభ్యులు సీఎం సురేష్ నాయుడు, మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, జేసీ డా.నిధీమీనా, ఎయిర్ పోర్ట్ అథారిటీ ప్లానింగ్ హెడ్ అనిల్ గుప్త, ఎయిర్ పోర్ట్ అథారిటీ రీజినల్ డైరెక్టర్ ఆచార్య మధుసూదన్, ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ సుజిత్ కుమార్ పోదర్ పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జలజీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం, డిప్యూటీ సీఎం.!

ఓటర్ల లిస్టులో మీ పేరు చెక్ చేసుకోండి.!

ప్రొద్దుటూరులో వార్డుల వారీగా ఓటర్ల వివరాలు ఇలా.!