బద్వేలు వద్ద రోడ్డు ప్రమాదంలో చౌడూరు వాసులు మృతి.!

ప్రొద్దుటూరు: బుధవారం అర్ధరాత్రి సమయంలో బద్వేలు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రొద్దుటూరు మండలం చౌడూరు గ్రామానికి చెందిన రమణయ్య, భాస్కర్ మృతి చెందారు. 
వీరు ప్రొద్దుటూరు నుంచి ట్రాక్టర్లో రాళ్లు తీసుకొని వెళుతుండగా బద్వేలు సమీపంలో వీరి ట్రాక్టర్ ను వెనుక వైపు నుంచి లారీ ఢీకొంది.  ఈ ప్రమాదంలో రమణయ్య, భాస్కర్ అక్కడికక్కడే మృతి చెందారు.  మృతదేహాలను బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  చౌడూరు నుంచి బంధువులు అక్కడికి వెళ్లారు.