టౌన్ బ్యాంక్ షేర్ హోల్డర్లకు 10 % డివిడెండ్.!
ప్రొద్దుటూరు టౌన్ బ్యాంక్ 105వ మహాజన సభ సమావేశం చైర్మన్ సుబ్బారెడ్డి అధ్యక్షతన గురువారం నిర్వహించారు. ముందస్తు సమాచారం లేక పలువురు షేర్ హోల్డర్లు, ఖాతాదారులు సమావేశానికి హాజరు కాలేదు. నామ మాత్రంగానే హాజరయ్యారు.
*గత ఆర్థిక సంవత్సరంలో రూ.1.69 కోట్ల నికర లాభం సాధించినట్లు తెలిపారు. షేర్ హోల్డర్లకు 10శాతం డివిడెండ్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఇటీవలి బ్యాంక్
సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. CEO నిరంజన్ రెడ్డి విజయవాడ ఆర్బీఐ కార్యాలయానికి వెళ్లడంతో సమావేశానికి హాజరు కాలేదని తెలిపారు. ఉపాధ్యక్షుడు మహమ్మద్ గౌస్, డైరెక్టర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.