ప్రొద్దుటూరు టౌన్ బ్యాంకులో అక్రమాలు చేసిన వారిపై.. పోలీస్ కంప్లైంట్.?
ప్రొద్దుటూరు టౌన్ బ్యాంకులో అక్రమాలు చేసిన వారిపై పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేయాలని కడప జిల్లా సహకార శాఖ అధికారి(DCO) వెంకట సుబ్బయ్య బ్యాంక్ CEO నిరంజన్ రెడ్డిని ఆదేశించారు. మంగళవారం DCO వెంకటసుబ్బయ్య, DLCO సత్యానంద్ ప్రొద్దుటూరు టౌన్ బ్యాంకులో విచారణ చేపట్టారు. వైసీపీ, టీడీపీ నేతల మద్య వివాదం నడుస్తున్న సుచరిత బ్యాంక్ అకౌంట్ వివరాలు పరిశీలించారు.
ఫోర్జరీ సంతకాలు, బినామీ అకౌంట్లపై చర్యలు చేపట్టాలని CEO నిరంజన్ రెడ్డిని ఆదేశించారు. బ్యాంక్ నుంచి ఖాతాదారుల వివరాలను తీసుకెళ్లి పబ్లిక్ డొమైన్‌లోకి చేరవేస్తున్న వారిపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని ఆదేశించారు.
*ప్రొద్దుటూరు టౌన్ బ్యాంకులో గోప్యంగా ఉండాల్సిన ఖాతాదారుల వ్యక్తిగత, ఆర్థిక వివరాలన్నీ పబ్లిక్ డొమైన్‌లోకి చైర్మన్, డైరెకర్లు తెస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. SS మాల్ రుణాలు, రికవరీ పత్రాలు టిడిపి నేత ఉక్కు ప్రవీణుకు పాలకవర్గం పెద్ద చేరవేశాడని ఆరోపణలు వచ్చాయి. విద్యుత్ శాఖ ఉద్యోగి సుబ్బరాయుడు ఇన్స్యూరెన్స్ క్లైమ్ అమౌంట్ అకౌంట్ వివరాలు, పత్రాలు, ఫోటోలు, ట్రాన్షాక్షన్స్ ఇటీవల బోర్డు మీటింగులో బయట పెట్టారని ఆరోపణలున్నాయి. వీటిని కొంతమంది పాలకవర్గం సభ్యులు వీడియోలు, పోటోలు తీసుకొని సెండ్ చేశారని తెలిపారు.
*టౌన్ బ్యాంకులో టీడీపీ లాయర్ ఇవి సుధాకర్ రెడ్డి ఫోర్జరీ సంతకాలతో బినామీ అకౌంట్లు ఓపెన్ చేశారని స్థానిక మాజీ ఎమ్మెల్యే రాచమల్లు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బంగారెడ్డి ఆరోపించారు. బ్యాంక్ చైర్మన్ సుబ్బారెడ్డి బ్యాంక్ రికార్డులు బయట పెట్టాడని వీరు ఆరోపించారు.