చేనేతలకు చైర్మన్ టిక్కెట్ ఇస్తే గెలిపించుకుంటాం: బొర్రా రామాంజనేయులు
ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ టిక్కెట్టు చేనేతలకే ఇవ్వాలని బీసీ ప్రజా చైతన్య సమాఖ్య అధ్యక్షుడు బొర్రా రామాంజనేయులు టిడిపి అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పద్మశాలియ కళ్యాణ మండపంలో పొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ టికెట్ విషయమై చేనేత కులాలతో సమావేశం నిర్వహించారు. టిడిపి నుంచి చైర్మన్ టిక్కెట్ చేనేతలకే ఇస్తే గెలిపించుకుంటామని ఆయన తెలిపారు. బీసీల్లో 45 శాతం చేనేతలే ఉన్నారన్నారు. దీంతో టీడీపీ నుంచి చైర్మన్ టికెట్ కోసం పోటీ పడుతున్న బీసీల్లోని ఇతర కులాలకు బొర్రా రామాంజనేయులు చెక్ పెట్టారని టిడిపి లోనే చర్చ జరుగుతోంది.