ప్రొద్దుటూరు టౌన్ బ్యాంకులో పొలిటికల్ వార్ జరుగుతోంది. బ్యాంక్ ఖాతాదారులు, షేర్ హోల్డర్స్ ఆందోళన చెందుతున్నారు. బ్యాంక్ సీఈఓ, సహకార శాఖ ఆడిటర్లు, ఆర్బిఐ అధికారులు పట్టించుకోవడం లేదన ఆరోపణలు వినిపిస్తున్నాయి. బ్యాంకులో చైర్మన్, డైరెక్టర్లు, ఉద్యోగులు అందరూ కూడా నేతల అనుచరులు, సిఫారస్ ద్వారా వచ్చిన వారే ఉన్నారనే విమర్శలు ఉన్నాయి. వీరు నేతలు చెప్పినట్లు పనులు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. SS మాల్ రుణాలు, విద్యుత్ ఉద్యోగి ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ అమౌంట్ విషయాల్లో ఫ్రాడ్ జరిగిందని టిడిపి, వైసిపి నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యరోపణలు చేసుకున్నారు.
| తేదీ |
డెబిట్ (₹) |
క్రెడిట్ (₹) |
బ్యాలెన్స్ (₹) |
| 06/Mar/2026 | 0.00 | 11,62,117.00 | 11,62,117.00 |
| 06/Mar/2026 | 3,480.00 | 0.00 | 11,58,637.00 |
| 09/Mar/2026 | 9,00,000.00 | 0.00 | 2,58,637.00 |
| 10/Mar/2026 | 2,57,500.00 | 0.00 | 1,137.00 |
| 31/Mar/2026 | 59.00 | 0.00 | 1,078.00 |
| 31/Mar/2026 | 0.00 | 309.00 | 1,387.00 |
| 25/Aug/2026 | 0.00 | 11,57,500.00 | 11,58,887.00 |
బ్యాంకు రికార్డుల్లో గోప్యతగా ఉండవలసిన పత్రాలను పబ్లిక్ డొమైన్ లోకి తెచ్చారు. ప్రస్తుతం వివాదం నడుస్తున్న అకౌంట్ ఓపెనింగ్, లావాదేవీల వివరాల రికార్డులు బయట అందరి చేతుల్లోకి వెళ్లాయి. ఈ పరిస్థితుల్లో ప్రొద్దుటూరు టౌన్ బ్యాంకులో గోప్యత, రక్షణ ఎక్కడుంటూ ఆందోళన చెందుతున్నారు.
ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.