ప్రొద్దుటూరు అగస్త్యేశ్వరాలంలో దేవుని సొమ్ము దోచేసిన గత ఈఓలు శంకర బాలాజీ, రామచంద్రాచార్యులుపై చర్యలు తీసుకోవాలని దేవాలయాల సంరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పుష్పాల శ్రీనాథ్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారి హయాంలో ఆలయంలో అమ్మవారి బంగారు హారం, స్వామివారి వెండి కవచం, బ్యాంకు అకౌంట్లో నుంచి రూ. కోటికి పైగా నగదు పక్కదారి పట్టాయన్నారు.
వీటిపై విచారణ జరిపిన అధికారులు రూ.62 లక్షలు ఫ్రాడ్ జరిగిందని రిపోర్ట్ ఇచ్చారన్నారు. దోషులు దొరికినా శిక్షించడం లేదెందుకని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పూనుకుంటామని హెచ్చరించారు.
ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.