చౌడూరులో బండ లాగుడు పోటీలు.!
ప్రొద్దుటూరు మండలం చౌడూరు గ్రామంలో బుధవారం బండ లాగుడు ఎడ్ల పోటీలను నిర్వహించారు. స్థానిక MLA వరదరాజుల రెడ్డి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి యాంత్రీకరణ పరిస్థితుల్లో వ్యవసాయానికి ఎడ్లను ఉపయోగించడం తగ్గిందన్నారు. బండ లాగుడు ఎడ్ల పోషణ, వాటి నిర్వహణ చాలా కష్టమన్నారు. ఇటువంటి పోటీలను ప్రోత్సహించాలన్నారు.