స్కూల్ పిల్లల నిజాయితీ.. అభినందించిన పోలీసులు.!
ప్రొద్దుటూరు పట్టణంలోని గవిని సర్కిల్ వద్ద మనీ పర్సు పడిపోయి ఉండగా, అక్కడే సైకిల్ తొక్కుతున్న ఆదర్శ కాలానికి చెందిన స్కూల్ పిల్లలు రాకేష్ 13 Yrs, నవదీపు 12 Yrs, శుభం 12 Yrs ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్సై మధుసూదన్ రెడ్డికి అప్పగించారు. సదరు పర్సులో రూ.720/-లు నగదు, కూడిన ఆధార్ కార్డు ద్వారా ఇల్లూరు రామచంద్రకు చెందినదిగా గుర్తించారు. స్కూల్ విద్యార్థుల నిజాయితీని పొద్దుటూరు 1టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కొండారెడ్డి మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది అభినందించారు.