ప్రొద్దుటూరు కమిషనర్కు రీల్స్ పిచ్చి: బంగారెడ్డి
ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్కు రీల్స్ పిచ్చి పట్టుకుందని, అందుకే తన చాంబర్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో తొలగించి స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఫోటో ఏర్పాటు చేశాడని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బంగారెడ్డి విమర్శించారు. బంగారెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఏ జీవో నిబంధనల మేరకు కమిషనర్ ఎమ్మెల్యే ఫోటో పెట్టుకున్నారో చెప్పాలన్నారు. రీల్స్ పిచ్చితో పోలీస్ ఇతర శాఖల పనిలో జోక్యం చేసుకొని, వారిని కించపరిచేలా పోస్టులు పెడుతున్నాడన్నారు. సోమవారం లోపు ఎమ్మెల్యే పోటో తొలగించాలని, లేదా ఎంపీ ఫోటోకూడా పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.