ప్రొద్దుటూరు AMC చైర్మన్ ఎవ్వరు.?

ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి పోటీ ఏర్పడింది.  AMC పాలకవర్గం కాలపరిమితి శుక్రవారం ముగిసింది.  చైర్మన్ వద్ది సురేఖ రాజీనామాతో నేటి వరకు లక్ష్మణ్ ఇంచార్జి చైర్మన్ కొనసాగారు.  రేపటి నుంచి అధికారుల పాలన సాగనుంది.  AMC చైర్మన్ పదవికి స్థానిక MLA వరదరాజుల రెడ్డి శుక్రవారం లక్ష్మణ్ పేరును ప్రభుత్వానికి పంపారు.  కాగా.. టీడీపీకే చెందిన మరో నేత ఉక్కు ప్రవీణ్ మాత్రం బాబుల్ రెడ్డి పేరును పార్టీకి ఇచ్చారని అంటున్నారు.  వీరిలో చైర్మన్ సీట్లో కూర్చునేది ఎవ్వరంటూ పార్టీలో 
చర్చించుకుంటున్నారు.  కాగా ఓ ట్రేడర్ ఈ పదవికి రూ.50 లక్షలు ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?