టౌన్ బ్యాంక్ చైర్మన్ పై డైరెక్టర్ల అసమ్మతి.. బోర్డు మీటింగు బాయికాట్.!
ప్రొద్దుటూరు టౌన్ బ్యాంక్ బోర్డు మీటింగ్ సోమవారం చైర్మన్ బొగ్గుల సుబ్బారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఇటీవల టౌన్ బ్యాంకులో జరిగిన నిబంధనల ఉల్లంఘన, డేటా లీకేజీ, అక్రమాలపై చైర్మన్ తీరుపై సమావేశంలో 8 మంది డైరెక్టర్లు అసమ్మతి వ్యక్తం చేశారు. సమావేశం నుంచి
బాయికాట్ చేశారు. మరో ఇద్దరు డైరెక్టర్లు సమావేశానికి గైర్హాజరయ్యారు. చివరికి సమావేశంలో చైర్మన్తో పాటు డైరెక్టర్ ఖలీల్, CEO నిరంజన్ రెడ్డి మాత్రమే మిగిలారు. బ్యాంక్ వైస్ చైర్మన్ అక్రమ్ గౌస్, డైరెక్టర్లు కుమార్ రెడ్డి, రమణారెడ్డి, రాంభూపాల్ రెడ్డి, కిషోర్, సురేష్, సురేంద్ర, గంగాధర్ బాయికాట్ చేశారు. మరో ఇద్దరు డైరెక్టర్లు నందం సీతారామయ్య, భాస్కర్ రెడ్డి సైతం గైర్హాజరయ్యారు.
*టోన్ బ్యాంక్ చైర్మన్ రాజీనామా.?
*సోమవారం జరిగిన బ్యాంక్ డైరెక్టర్ల సమావేశం తీరును పరిశీలిస్తే.. బ్యాంక్ చైర్మన్ బొగ్గుల సుబ్బారెడ్డిపై మెజారిటీ డైరెక్టర్లు అవిశ్వాసంతో ఉన్నారు. చైర్మన్ రాజీనామా కోరుతున్నారు. దీంతో చైర్మన్ రాజీనామా చేయడమో, అవిశ్వాసం ద్వారా తొలగించడమో జరగొచ్చని బ్యాంక్ వర్గాలు అనుకుంటున్నాయి.