రేపు టౌన్ బ్యాంక్ మీటింగ్.. 12వ అంశంపైనే రచ్చ.?
ప్రొద్దుటూరు టౌన్ బ్యాంకు అత్యవసర బోర్డు మీటింగు బుధవారం నిర్వహిస్తున్నారు. ఇందులో 12వ అంశంపైనే రచ్చ జరుగుతోంది. ఆగస్టు నెలలో బ్యాంకులో జరిగిన అవినీతి, అక్రమాలు, అవకతవకలపై చర్చించేందుకు అజెండాలో 12వ అంశంగా తీసుకువచ్చారు. వీటిపై గత బోర్డు మీటింగులో పోలీస్ కేస్ ఫైల్ చేయడము, విచారణ నిర్వహించడం, బాధ్యులపై చర్యలు తీసుకోవడంపై చైర్మన్ కు అధికారం ఇచ్చారు. కాగా.. చైర్మన్ చర్యలు తీసుకోకపోవడంపై సోమవారం సమావేశం నుంచి డైరెక్టర్లు బాయికాట్ చేశారు.