ప్రొద్దుటూరులో రూ.1.20 కోట్లతో పవర్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు.!

ప్రొద్దుటూరులో నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం రూ.1.20 కోట్లతో 5.0 MVA పవర్ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభం చేసినట్లు జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ సోమా శ్రీనివాసులు తెలిపారు. శనివారం హౌసింగ్ బోర్డ్ కాలనీలో 33/11 KV సబ్ స్టేషన్‌లో 5.0 MVA పవర్ ట్రాన్స్ఫార్మర్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వినియోగదారులకు నాణ్యమైన మరియు విశ్వసనీయ విద్యుత్ సరఫరా అందించడం విద్యుత్ శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పెరుగుతున్న విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన ఈ అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్ ద్వారా లోడ్‌ను సమర్థవంతంగా విభజించి, విద్యుత్ అంతరాయాలను తగ్గించడంతో పాటు వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించగలమని పేర్కొన్నారు.
*అనంతరం నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.   విద్యుత్ బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించి, లక్ష్యాలను సాధించాలని సూచించారు. విద్యుత్ చౌర్యాన్ని అరికట్టేందుకు క్షేత్రస్థాయిలో తనిఖీలు ముమ్మరం చేయాలని, విద్యుత్ చౌర్యం మరియు అనుమతించిన పరిమితికి మించి అధిక లోడ్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  కొత్త వ్యవసాయ విద్యుత్ సర్వీసుల విడుదలలో ఎటువంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ నష్టాలను నియంత్రిస్తూ ఆదాయ వృద్ధికి కృషి చేయడంతో పాటు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించే దిశగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు చాంద్ భాషా, రమణారెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు మారుతి శ్రీనివాసుల రెడ్డి, అసిస్టెంట్ ఇంజనీర్లు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జలజీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం, డిప్యూటీ సీఎం.!

ఓటర్ల లిస్టులో మీ పేరు చెక్ చేసుకోండి.!

ప్రొద్దుటూరులో వార్డుల వారీగా ఓటర్ల వివరాలు ఇలా.!