ముక్తి రామలింగేశ్వర స్వామి ఆదాయం రూ.10.62 లక్షలు

ప్రొద్దుటూరు: రామేశ్వరంలోని ముక్తి రామలింగేశ్వర స్వామి 
ఆలయానికి చెందిన 27.34 ఎకరాల భూములను సాగు చేసుకోవడానికి బుధవారం వేలం నిర్వహించారు.  వేలంలో గుత్త రూపంలో రూ.10.62 లక్షల ఆదాయం లభించిందని ఆలయ ఈఓ శ్రీధర్ తెలిపారు. గతంలో రూ.1,35,300 మాత్రమే ఆదాయం రాగా.. ఇప్పుడు రూ.9,26,700లు అధికంగా వచ్చింది.  ఎండోమెంట్ అధికారులు కిరణ్ కుమార్ రెడ్డి, రమణారెడ్డి, శ్రీనివాసులు, మారుతి ప్రసాద్, 1టౌన్ సీఐ కొండారెడ్డి, ఎస్సై మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.