నేడు YCP ర్యాలీ ఉంటుందా.!
కడప(ఆగస్ట్, 9): నేడు సోమవారం నియోజకవర్గ కేంద్రాల్లో YCP నిర్వహించతలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతులు ఇవ్వలేదు. ర్యాలీ నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామంటూ YCP ముఖ్య నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. MLCలు రామసుబ్బారెడ్డి, గోవిందరెడ్డికి నోటీసులు ఇచ్చారు. నియోజకవర్గ, మండలస్థాయి నేతలందరికీ నోటీసులు ఇచ్చారు. హౌస్ అరెస్ట్ చేయనున్నారు.
*ప్రొద్దుటూరు మాజీ MLA రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, మరికొంతమంది నేతలు మాత్రం పోలీసులకు అందుబాటులో లేరు. ఈ పరిస్థితుల్లో నేడు YCP ర్యాలీ ఉంటుందా.. ఉండదా అనే ఉత్కంఠ నెలకొంది.