ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేక దృష్టి: జిల్లా SP
ప్రొద్దుటూరు(ఆగస్ట్, 5): పంచాయితీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా SP నచికేత్ విశ్వనాధ్ ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ అధికారులకు సూచించారు. SP బుధవారం రూరల్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు, మట్కా, జూదంపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించారు. CI నాగభూషణ్, SIలు రాజు, శ్రీకాంత్ SPకి రికార్డులను చూపించారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.