ఉచిత వైద్య సేవలు అభినందనీయం: MLA వరదరాజుల రెడ్డి
ప్రొద్దుటూరు(ఆగస్ట్, 9): స్థానిక NGO హోం, జిన్నారోడ్డు ఉర్దూ స్కూల్లో ఆదివారం ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. NGO హోంలో జరిగిన కార్యక్రమంలో MLA వరదరాజుల రెడ్డి మాట్లాడుతూ.. ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటు అభినందనీయమన్నారు. ప్రజలు ఉపయోగించు కోవాలన్నారు. రాష్ట్ర షేక్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ముక్తియార్, NGO అసోసియేషన్ అధ్యక్షుడు సుబ్బరామయ్య, స్పాన్సర్స్, వైద్యులు పాల్గొన్నారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.