రాజుపాలెం ఎస్సైని ప్రశంసించిన ఎస్పీ.!
కడప: కేసులను ఛేదించి అత్యుత్తమ పనితీరు కనబరచిన పోలీస్ అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రశంసా పత్రాలు, నగదు రివార్డులు అందజేశారు.
*రాజుపాలెం ఎస్ఐ ప్రణయ్ కుమార్ రెడ్డి, ఎర్రగుంట్ల ఎస్ఐ నాగమురళి, లింగాల ఎస్ఐ జగదీశ్వర రెడ్డి,
కమాండ్ కంట్రోల్ పోలీస్ కానిస్టేబుల్ జాన్, పులివెందుల పిఎస్ హోమ్ గార్డు రామాంజనేయులుకు ప్రశంశా పత్రాలు, నగదు రివార్డులు ఎస్పీ ప్రధానం చేశారు.
*ప్రొద్దుటూరు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి కార్యాలయం హెడ్ కానిస్టేబుల్ సుధాకర్, 3-టౌన్ కానిస్టేబుల్ వీరాంజనేయులుకు ఉత్కృష్ట సేవా మెడల్స్ ఎస్పీ ప్రధానం చేశారు.
*సమావేశంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) ప్రకాశ్
బాబు, ప్రొద్దుటూరు ASP విభుకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.