‘నీతి తార’పై శిక్షణ.!

కడప(ఆగస్ట్, 7): ఆస్పిరేషనల్ జిల్లా కార్యక్రమం (ఎడిపి), ఆస్పిరేషనల్ బ్లాక్స్ కార్యక్రమం (ఎబిపి) అమలును మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు శుక్రవారం కడప జిల్లా కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్ హాలులో 'నీతి తార (NITI TARA – Toolkit for Analysis Review and Action)' పై జిల్లా స్థాయి సామర్థ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
*జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ హజరతయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో.. ప్రణాళికల రూపకల్పన, అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ, సమీక్షలు, ఆధారపూర్వక నిర్ణయాల కోసం నీతి తార వేదికను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు.  ప్రతి శాఖ తమ రోజువారీ సమీక్షల్లో భాగం చేసుకుని పరిపాలనను మరింత ఫలవంతంగా మార్చాలని పిలుపునిచ్చారు.
*ఎడ్‌సీఐఎల్ (ఇండియా) మాస్టర్ ట్రైనర్ నర్సింగ్ దాస్ సాంకేతిక శిక్షణ అందిస్తూ, నీతి తార పరికరం వినియోగ విధానం, ప్రామాణిక నిర్వహణ విధానాలు (ఎస్‌ఓపీ), 'నీతి ఫర్ స్టేట్స్' పోర్టల్, 'వికసిత్ భారత్ స్ట్రాటజీ రూమ్', 'ఏరియా డెవలప్‌మెంట్ స్ట్రాటజీ' సాధనం, సమావేశాల నమోదుతో పాటు చర్యల పర్యవేక్షణకు ఉపయోగపడే కృత్రిమ మేధస్సు ఆధారిత 'స్మృతి (SMRITI)' వేదికల వినియోగంపై ప్రత్యక్ష ప్రదర్శనతో కూడిన శిక్షణ ఇచ్చారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జలజీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం, డిప్యూటీ సీఎం.!

ఓటర్ల లిస్టులో మీ పేరు చెక్ చేసుకోండి.!

ప్రొద్దుటూరులో వార్డుల వారీగా ఓటర్ల వివరాలు ఇలా.!