సంవృద్ధిగా వానలు కురవాలంటూ శోభాయాత్ర.!
ప్రొద్దుటూరు(ఆగస్ట్, 8): సంవృద్ధిగా వానలు కురవాలంటూ, పాడి పంటలు అభివృద్ధి చెందాలంటూ శనివారం ప్రొద్దుటూరులో VHP ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. 108 కలశాలతో మహిళలు శోభాయాత్రలో పాల్గొన్నారు. భజనలు, కీర్తనలతో స్థానిక శివాలయం నుంచి చెన్నకేశవ స్వామి ఆలయం వరకు నిర్వహించారు. పోతురాజు గడ్డకు జలాభిషేకం చేసి, మొక్కులు తీర్చుకున్నారు. VHP, BJP, హిందూ సంఘాల నేతలు, ప్రజలు పాల్గొన్నారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.