జాతీయ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన ప్రొద్దుటూరు పోలీసులకు సెల్యూట్.!
ప్రొద్దుటూరు(ఆగస్ట్, 11): అఖిల భారత జాతీయ పోలీస్ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన ప్రొద్దుటూరుకు చెందిన పోలీసులను మంగళవారం కడపలో జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్, అడిషనల్ ఎస్పీ రమణయ్య అభినందించారు. ప్రొద్దుటూరు 3-టౌన్ PS మహిళా PC శివకుమారి పెంచాక్ సిలోట్ క్రీడలో 100 కేజీల విభాగంలో రజతం సాధించారు.
స్థానిక 2-టౌన్ SI మహబూబ్ బాషా, ట్రాఫిక్ PS PC మహబూబ్ భాషా తైక్వాండో పూమ్సే విభాగంలో కార్టర్ ఫైనల్ వరకు వెళ్లారు. వీరి పోరాట స్ఫూర్తిని అధికారులు అభినందించారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.