ప్రొద్దుటూరు పోలీసులపై వేటు.!

ప్రొద్దుటూరు(ఆగస్ట్, 4): తిరుపతికి చెందిన యువతుల నుంచి రూ.50వేలు వసూలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొద్దుటూరు 1టౌన్ PSకు చెందిన HC దస్తగిరి, PCలు శ్రీనివాసులు, సాయిలను మంగళవారం విధుల నుంచి తప్పించారు. VRకు పంపారు.  జిల్లా పోలీస్ కార్యాలయంలో రిపోర్ట్ చేసుకోవాలని అధికారులు ఆదేశించారు.  
*తిరుపతికి చెందిన యువతుల నుంచి రూ.50వేలు డిమాండ్ చేశారు.  క్యాష్ లేదని చెప్పడంతో,  స్నేహితుని నెంబరుకు UPI చేయించుకున్నారు.  దీనిపై ప్రొద్దుటూరు ASP విభుకృష్ణ విచారణ చేపట్టారు.  ఆ ముగ్గురు పోలీసులను, వారి స్నేహితుని విచారిస్తున్నారు.  తిరుపతి యువతులను ఫోన్లో విచారిస్తున్నారు.
*ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులను తాత్కాలికంగా VRకు పంపారు.  పూర్తి నివేదిక వచ్చాక చర్యలు తీసుకోనున్నారు.
- ‎ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.
‎