గొర్రెల దొంగల ముఠా నాయకుడు అరెస్ట్: ASP విభుకృష్ణ
రాజుపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో పోట్టేళ్ళు/ గొర్రెలు దొంగతనం కేసులో దొరక్కుండా తప్పించుకొని తిరుగుతున్న దొంగల ముఠా నాయకుడు దేవరకొండ రమేష్, @ వంకాయ ముక్కు రమేష్ ను శుక్రవారం అరెస్టు చేసి, రూ.1,50,000/- లు స్వాదీనం చేసుకున్నట్టు ప్రొద్దుటూరు ASP విభుకృష్ణ తెలిపారు. ఇప్పటి వరకు ఈ కేసులో రూ.6.70 లక్షల నగదు, మహీంద్రా XUV500 కారు, ఒక బొలెరో వాహనం, బజాజ్ పల్సర్ NS400 మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
"ASP విభుకృష్ణ సమాచారం మేరకు..
రాజుపాలెం పిఎస్ పరిధిలో పోట్టేళ్ళు/ గొర్రెలు దొంగతనం కేసులో నిందితులకు నాయకత్వం వహించి రాజుపాలెం, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల ప్రాంతాలలో గొర్రెల షెడ్లలో పొట్టేళ్లు/గొర్రెలను రాత్రి సమయంలో అపహరించి, వాహనాల ద్వారా తరలించి విక్రయించడం ద్వారా అక్రమంగా ఆర్థిక లాభం పొందుతూ పోలీసు వారికి దొరక్కుండా తప్పించుకొని తిరుగుతున్న ముఠా నాయకుడు అయిన దేవరకొండ రమేష్, @ వంకాయ ముక్కు రమేష్ వయస్సు 39 సం,, తండ్రి పెద్ద సుంకన్న, కులం: ST ఎరుకల, వృత్తి: పందుల పెంపకం r/at D.No.16-207, రామ్ భూపాల్ నగర్, బనగాన పల్లె, కర్నూల్ జిల్లా ప్రస్తుతం నంద్యాల జిల్లా ను అదుపులోకి తీసుకొని అతని నుండి రూ.1,50,000/- లు స్వాదీనం చేసుకున్నాము. రమేష్ ఈ నేరాల ద్వారా సంపాదించిన నగదు ఈ విలాసవంతమైన జీవనానికి వినియోగిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది
*కేసు వివరాలు: రాజుపాలెం మండల పరిధిలోని వెంగలాయ పల్లె గ్రామంలో మే నెల 23/24 వ తేదీలలో రాత్రి 18 జీవాలు దొంగతనం చేశారు.( Rajupalem PS Cr.No.40/2026 U/s 305(a) BNS)
రాజుపాలెం మండల పరిధిలోని రామచంద్ర పురం గ్రామములో మార్చ్ నెల 29/30 వ తేదీలలో రాత్రి 20 జీవాలు దొంగతనం చేశారు.( Rajupalem PS Cr.No.42/2026 U/s 305(a) BNS)
ప్రొద్దుటూరు మండలము, గోపవరం గ్రామములో మార్చ్ నెల 13/14 తేదీలలో రాత్రి 13 జీవాలు దొంగతనం చేశారు. .( Proddatur Rural PS Cr.No.165/2026 U/s 305(a) BNS)
రాజుపాలెం మండల పరిధిలోని అరకటవేముల గ్రామములో గత సంవత్సరం నవంబర్ నెల 01/02 వ తేదీలలో రాత్రి 03 జీవాలు దొంగతనం చేశారు. .( Rajupalem PS Cr.No.46/2026 U/s 305(a) BNS
యర్రగుంట్ల మండలం, పోట్లదుర్తి గ్రామములో మార్చి నెల 11/12 తేదీలలో రాత్రి 12 జీవాలు దొంగతనం చేశారు.( Yerraguntla PS Cr.No.86/2026 U/s 303(2) BNS
గ్రామాల్లో జీవాలు దొంగతనాలు జరుగుతున్నాయని వచ్చిన ఫిర్యాదుల, ప్రొద్దుటూరు ASP, U.విభూ క్రిష్ణ గారి ఆదేశాలు మేరకు ప్రొద్దుటూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్, M. నాగ భూషణ్ గారి ఆద్వర్యంలో రాజుపాలెం యస్.ఐ, G.ప్రణయ్ కుమార్ రెడ్డి మరియు సిబ్బంది తోటి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ చేపట్టడం జరిగింది.
దర్యాప్తులో భాగంగా సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీ మరియు విశ్వసనీయ సమాచారం ఆధారంగా నేరానికి పాల్పడిన ముఠాను గుర్తించి ఇంతకు మునుపు ఆరు మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడమైంది. తదుపరి వీరికి నాయకత్వం వహించి పోలీసు వారికి దొరక్కుండా తప్పించుకొని తిరుగుతున్న దేవరకొండ రమేష్, @ వంకాయ ముక్కు రమేష్ ను 20.08.2026 వ తేదీ 6 PM గం,, లకు రాజుపాళెం మండలం, రాజుపాళెం గ్రామం లోని విజయ కిసాన్ సేవా కేంద్ర ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు వద్ద అరెస్ట్ చేయడం జరిగింది.
*12.06.2026 వ తేదీన అరెస్ట్ అయిన ముద్దాయి ల వివరాలు:-
1. దేవర కొండ సురేంద్ర , వయస్సు.19 సం||లు, పాణ్యం టౌన్, నంద్యాల జిల్లా.
2. దేవర కొండ గణేష్, వయస్సు.20 సం||లు, పాణ్యం టౌన్, నంద్యాల జిల్లా.
15.06.2026 వ తేదీన అరెస్ట్ అయిన ముద్దాయి ల వివరాలు
3.శ్రీ రాముల చిన్న వెంకటేష్, వయస్సు.22 సం||లు, చాగలమర్రి గ్రామము మరియు మండలము , నంద్యాల జిల్లా.
చట్టం తో సంఘర్షణ పడిన బాలుడు:
2. పగిడాల చరణ్. వయస్సు.16 సం|| లు, చాగలమర్రి గ్రామము మరియు మండలము , నంద్యాల జిల్లా.
01.07.2026 వ తేదీన అరెస్ట్ అయిన ముద్దాయి ల వివరాలు:-
5 .ఎరుకలి శ్రీనివాసులు, వయస్సు 32 సం||లు, తండ్రి: సూరన్న, సోమయాజులపల్లె, ఓర్వ కల్ మండలం, కర్నూల్ జిల్లా
6 .ఎరుకలి నరేష్, వయస్సు ౩4 సం.లు తండ్రి తండ్రి: సూరన్న, సోమయాజులపల్లె, ఓర్వ కల్ మండలం, కర్నూల్ జిల్లా
20.08.2026 వ తేదీన అరెస్ట్ అయిన ముద్దాయి వివరాలు:-
7. దేవరకొండ రమేష్, @ వంకాయ ముక్కు రమేష్ వయస్సు 39 సం,, తండ్రి పెద్ద సుంకన్న, కులం: ST ఎరుకల, వృత్తి: పందుల పెంపకం r/at D.No.16-207, రామ్ భూపాల్ నగర్, బనగాన పల్లె, కర్నూల్ జిల్లా ప్రస్తుతం నంద్యాల జిల్లా
రమేష్ యొక్క పాత కేసుల వివరాలు
1. Banaganapalli PS Cr.No.119/2018 U/sec 307, 324 r/w 34 IPC (Acq)
2. Banaganapalli PS Cr.No.105/2023 U/sec 353, 506, 509 IPC
3. Banaganapalli PS Cr.No.138/2014 U/sec 307, 324 r/w 34 IPC
4. Banaganapalli PS Cr.No.80/2008 U/sec 380, 454 IPC (Acq)
5. Banaganapalli PS Cr.No.196/2013 U/sec 323, 324, 506 r/w 34 IPC (Con)
6. Banaganapalli PS Cr.No.59/2008 U/sec 380, 457 IPC (Acq)
7. Gadivemula PS Cr.No.128/2019 U/sec 379 IPC
8. Besthavaripeta PS Cr.No.210/2023 U/sec 379 IPC
9. B. Matam PS Cr.No.46/2016 U/sec 379 IPC (Acq)
10. Adhoni PS Cr.No.108/2020 U/sec 160 IPC (Con)
స్వాధీనం చేసుకున్నవి:
మొత్తం రూ.6.70 లక్షల డబ్బు, మహీంద్రా XUV500 కారు, ఒక బొలెరో వాహనం, బజాజ్ పల్సర్ NS400 మోటార్ సైకిల్ స్వాదీనపరచుకోవడమైంది
ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.