"తోక జాడిస్తే తాట తీస్తాం" అసాంఘిక శక్తులకు ASP విభుకృష్ణ స్ట్రాంగ్ వార్నింగ్.!

ప్రొద్దుటూరు ASP విభుకృష్ణ అసాంఘిక శక్తులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.  పొద్దుటూరు పోలీస్ సబ్ డివిజనల్ పరిధిలోని సీఐలు, ఎస్సైలు, మొత్తం పోలీస్ సిబ్బంది శుక్రవారం తెల్లవారుజాము నుంచి స్థానిక పెన్నానగర్లో ఆకస్మిక సోదాలు నిర్వహించారు.  ఇంటింటికి వెళ్లి తనిఖీలు జరిపారు.  అనుమానిత వ్యక్తుల వివరాలను ఆరా తీశారు.  బైకులు కార్లు ఇతర మోటారు వాహనాల రికార్డులను పరిశీలించారు.  సరియైన పత్రాలు లేని 25 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.  మట్కా, గుట్కా, గ్యాబ్లింగ్, గంజా తదితర నిషేధిత చట్ట వ్యతిరేక అసాంఘిక కార్యక్రమాల జోలికి వెళితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.
‎

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జలజీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం, డిప్యూటీ సీఎం.!

ఓటర్ల లిస్టులో మీ పేరు చెక్ చేసుకోండి.!

ప్రొద్దుటూరులో వార్డుల వారీగా ఓటర్ల వివరాలు ఇలా.!