ఇండిపెండెన్స్ డే రాష్ట్ర పెరేడ్ కమాండెంట్ గా ప్రొద్దుటూరు ASP విభుకృష్ణ.!
విజయవాడ(ఆగస్ట్, 14): స్వాతంత్య్ర దినోత్సవ రాష్ట్ర వేడుకల్లో పెరేడ్ కమాండెంట్ గా ప్రొద్దుటూరు ASP విభుకృష్ణ వ్యవహరిస్తున్నారు. సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యే ఈ కార్యక్రమం ఫైనల్ రిహార్సల్స్ గురువారం విజయవంతంగా పూర్తి చేశారు.
ఈ యేడాది రిపబ్లిక్ డే రాష్ట్ర వేడుకల్లో కూడా ASP విభుకృష్ణ కమాండెంట్ గా వ్యవహరించారు. రాష్ట్ర గవర్నర్ నుంచి ప్రశంశలు పొందారు. చిన్న వయసులోనే ASP విభుకృష్ణ అరుదైన అవకాశం, గౌరవం పొందారు.