ఆన్లైన్లో టెట్ వద్దు.. ఆఫ్ లైన్లోనే కావాలి: APTF శ్యాంసుందర్ రెడ్డి
ప్రొద్దుటూరు(ఆగస్ట్, 8): టెట్ పరీక్షలను ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్ ద్వారా నిర్వహించాలని APTF రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన శనివారం పొద్దుటూరులో మాట్లాడుతూ.. సీనియర్ టీచర్లకు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండదని, వారు ఆన్లైన్ పరీక్షలు రాయలేరని తెలిపారు. రాత పరీక్షలు నిర్వహించాలని కోరారు. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సుదీర్ఘ బోధనానుభవం కలిగిన ఉపాధ్యాయులకు మళ్లీ ఇప్పుడు అర్హత పరీక్షలు పెట్టడం సరికాదని మండిపడ్డారు.
- మరిన్ని స్థానిక తాజా వార్తలు కోసం WWW.PRODDATURNEWS.COM సందర్శించండి.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.