రేపే సోములవారిపల్లె గ్రామ సభ.!
ప్రొద్దుటూరు(జూలై, 29): గురువారం సోమలవారిపల్లె గ్రామసభను నిర్వహిస్తున్నారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో సోములవారిపల్లె విలీనంపై ప్రజాభిప్రాయ సేకరణకు గ్రామసభ ఏర్పాటు చేస్తున్నారు. స్పెషల్ ఆఫీసర్ మంజుల ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించనున్నారు. గ్రామసభ నిర్వహణ కోసం పంచాయతీ కార్యదర్శి నరసింహులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఇప్పటికే గోపవరం, దొరసానిపల్లె చౌటపల్లె, కొత్తపల్లె గ్రామ సభలు నిర్వహించారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.