అరటి తొక్కలతో అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయార్.. జాగ్రత్త.!
ప్రొద్దుటూరు(జూలై, 16): ప్రొద్దుటూరులోని శర్వనా మసాలా ఫుడ్స్ తయారీ కేంద్రంపై జిల్లా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. అరటి తొక్కలతో అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారీ చేయడాన్ని గుర్తించారు. వాటితో పాటు మసాలా పొడులను సీజ్ చేసి, ల్యాబ్ పంపించారు. రిపోర్టు వచ్చాక తయారీదారులపై చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ సిఐ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.
- ప్రొద్దుటూరు వార్తలు
PRODDATURNEWS.COM
Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News