అధికార పార్టీ అవినీతిని ప్రశ్నిస్తూనే ఉంటాం.! రాచమల్లు

ప్రొద్దుటూరులో అధికార పార్టీ నేతలు సాగిస్తున్న అవినీతిని ప్రశ్నిస్తూనే ఉంటామని స్థానిక వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. అంతమాత్రాన పశ్నించే వారందరిపైనా దాడులు చేస్తారా అన్నారు.  స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, ఆయన కుమారుడు కొండారెడ్డి, పార్టీ నేతలు ప్రభుత్వ సొమ్మును దోపిడీ చేస్తున్నారన్నారు.